Thursday, June 18, 2009

భజన 2

(హిందుస్తానీ భైరవి - చాపు )


నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని
ఈడు జగమున లేక యంతట హెచ్చి వెలిగెడు జ్యోతిని
Lets all sing of the Supreme Lord together
He  who illumines this world bright with his presence

కందరమ్ముల మందిరమ్ముల గహన పర్వత సీమల
సుందర ధ్వని తోడ యోగులు స్తుతి యొనర్చెడు దేవుని
In the jungles, in the temples and in the ranges of mountains
The One praised in harmony by the Yogis devout

చెట్టు చెట్టునఁగాననంబున - జెలఁగు మధురరుతంబుల
పిట్ట లెవనిని పాడుచుండునో - ప్రీతిసాగరునాతని
On every tree in every forest through the passing seasons
The One of whom the li'l birds sing
The boundless sea of love is He

నూతులందును చెఱువులందును - లోఁతు తెలియని జలధి లో
శీత జలమును ద్రావి కీర్తన చేయు జలచర మాతని
In the wells, In the ponds, In the unknown depths of the oceans
The One whose praises sing all creatures of the deep

ఉత్సవంబుల నుల్లమలరఁగ - నువిదలెవ్వని బాడుచు
నుత్సహింతురో యాదయామయు - నుత్తమోత్తమ పురుషుని
The One whose glory is sung at fests fervently
Sing of Him ,The Greatest of the great

వీరులును వీరాధివీరులు - శుద్ధ హృదయాంబుజముల
సారె సారె కు నెవనిఁ దలతురొ - సత్స్వరూపుఁబరేశుని
The Mighty, The Pure of Heart remember Him
Every waking hour, again and again
Of That, The One True Lord we Sing

No comments:

Post a Comment