Wednesday, June 17, 2009

భజన 1

( హిందుస్తానీ భైరవి - రూపకము )
విశ్వవిభుని ధ్యానము - విమల ముక్తి సోపానము
శాశ్వత సుఖ సంధానము - సకల రిషివిధానము
కామక్రోధ లోభముల్ - కఠిన శత్రు జాలముల్
నేమము తో వాని నడుప - నిజము చెదరు దురితముల్
చిత్తమందసూయ పుట్టి -చిచ్చు వోలె మండకుండ
ఉత్తమ శాంత స్వభావ - మూని యుండుము నిరతము
మిత్రదృష్టి తోడఁబ్రాణి - మాత్రమెపుడు చూడుము
పాత్రవర్తన కల్గి జీవన - యాత్ర సలుపఁగడఁగుము
జగమునద్భుతంబుగా - సలిపి యేలు వానికంటె
జగతినధికుఁడెవడు లేడు - శరణమతని బొందుము

No comments:

Post a Comment